తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐసోలేషన్ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ - Isolation Ward Latest News

నిర్మల్ జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు. 70 పడకలు గల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఐసోలేషన్ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ
ఐసోలేషన్ వార్డును తనిఖీ చేసిన కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

By

Published : Aug 9, 2020, 4:06 PM IST

నిర్మల్ జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వెల్లడించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ వార్డును అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చి ఇంట్లో ప్రత్యేక గది లేని వారి కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 70 పడకలు, బైంసాలో 30 పడకల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు సహకరించాలి...

క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ దేవేందర్ రెడ్డి, డా.కార్తీక్, మున్సిపల్ కమిషనర్ ఎన్​.బాలకృష్ణ, పట్టణ తహసీల్దార్ సుభాష్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details