తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్​ - latest news of nirmal

జీవ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్​ ఫారూఖీ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన జీవవ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

collector musharf sharuski meeting on bio degradable management in nirmal
జీవవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్​

By

Published : Jul 8, 2020, 8:11 PM IST

నిర్మల్ జిల్లాలో జీవవ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవవ్యర్ధాల నిర్వహణపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జీవ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

ఎక్కడైతే జీవ వ్యర్థాలు వెలుగుతాయో... వారు కాలుష్య నియంత్రణ మండలిలో జూలై 16లోపు పేరు నమోదు చేసుకోవాలన్నారు. అలా పేరు నమోదు చేసుకోకుండా జీవవ్యర్థాలను మండిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ భిక్షపతి, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.వసంత్ రావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'

ABOUT THE AUTHOR

...view details