తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% సాధారణ ప్రసవాలు జరగాలి: నిర్మల్​ కలెక్టర్​

నిర్మల్ జిల్లాలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో యాభై శాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసిన ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

collector musharaf sharukhi meeting on Deliveries Held in private hospitals in nirmal district
ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% సాధారణ ప్రసవాలు జరగాలి: నిర్మల్​ కలెక్టర్​

By

Published : Nov 8, 2020, 1:39 PM IST

Updated : Nov 8, 2020, 2:24 PM IST

నిర్మల్​ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై సమావేశం నిర్వహించారు. ఆకార్యక్రమంలో కలెక్టర్​ ముషర్రఫ్​ షారుఖీ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రులలో 50శాతం సాధారణ ప్రసవాలు కచ్చితంగా జరగాలని ఆయన వైద్యులను ఆదేశించారు. గర్భిణీలకు, కుటుంబ సభ్యులకు ఆపరేషన్ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆసుపత్రులు, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసమావేశంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా. ధన్​రాజ్, డాక్టర్లు కార్తీక్, రజిని, ఆశిష్, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కలెక్టరేట్​ను ముట్టడించిన ఎమ్మార్పీస్​ కార్యకర్తలు

Last Updated : Nov 8, 2020, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details