ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రసూతి ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - collector inspection in nirmal delivery hospital

నిర్మల్​ జిల్లా కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారుఖీ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి... సిబ్బందికి పలు సూచనలు చేశారు.

collector inspection in nirmal delivery hospital
ప్రసూతి ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Mar 14, 2020, 2:40 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలెక్టర్ ముషారఫ్​ అలీ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, వసతుల కల్పనపై రోగులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వస్తున్న రోగుల సంఖ్య, ప్రసవాల గురించి వైద్య సిబ్బందితో మాట్లాడారు.

ఆసుపత్రిలో వైద్య సేవలపై మార్పు రావాలని, సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. ఆసుపత్రిలో 80 శాతం సాధారణ ప్రసవాలు జరగాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రసూతి ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఇదీ చూడండి:కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details