నిర్మల్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో పరిశుభ్రత, నిబంధనలు పాటించాలన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ నెల 16న నిర్మల్, భైంసా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతగా కేంద్రానికి 30మంది చొప్పున మూడింటిలో 90మందికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు.
తొలి విడత..
ఈ నెల 18నుంచి 25కేంద్రాల్లో టీకాలు వేయడం జరుగుతుందన్నారు. తొలి విడత ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండోసారి మున్సిపల్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసు, రెవెన్యూ, ఫ్రంట్లైన్ ఉద్యోగులకు ఇవ్వాలన్నారు.