తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం వ్యాఖ్యలను  ఉపసంహరించుకోవాలి'

ఎవరో ఒకరు చేసిన తప్పునకు రెవెన్యూ ఉద్యోగులందరిని నిందించడం సీఎం కేసీఆర్​కు​ సరికాదని నిర్మల్​ జిల్లా సిబ్బంది ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సంయుక్త పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు.

రెవెన్యూ ఉద్యోగుల వినతిపత్రం

By

Published : Mar 30, 2019, 6:58 PM IST

Updated : Mar 30, 2019, 7:30 PM IST

సీఎం వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
నిర్మల్​ జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మంచిర్యాల జిల్లా నందులపల్లి గ్రామంలో వారసత్వ పట్టా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ రెవెన్యూ ఉద్యోగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని నిరసన తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేను ఒకరోజులో పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఉద్యోగులను అవమానించడం బాధాకరమని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్​ అన్నారు. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. జిల్లా సంయుక్త పాలనాధికారి భాస్కర్​ రావుకు వినతి పత్రం అందజేశారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జేసీ భాస్కర్​ రావు తెలిపారు.

Last Updated : Mar 30, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details