ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. ఇవాళ నిర్మల్లో, సోమవారం వికారాబాద్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో సభకు హాజరుకానందున మరోసారి అక్కడ బహిరంగ సభ నిర్వహించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. గడువు లేదని భావిస్తే వికారాబాద్ పర్యటనతోనే ప్రచారం ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తుది విడత సభలకు భారీగా జన సమీకరణ చేసేందుకు తెరాస నేతలు కసరత్తు చేస్తున్నారు.
16 స్థానాల్లో గెలుపే లక్ష్యం
తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెరాస అధినేత ప్రచారం సాగించారు. గత నెల 17న కరీంనగర్లో బహిరంగ సభతో సమరభేరి మోగించారు. నిజామాబాద్ సభ తర్వాత కాస్త విరామం ఇచ్చి 31 నుంచి మలి విడత ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఏప్రిల్ 4 వరకు మొత్తం పది నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ నియోజకవర్గాలకు కలిసి సంయుక్తంగా గత నెల 31న ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించినప్పటికీ జనసమీకరణలో లోపం కారణంగా సీఎం ఆ సభకు హాజరు కాలేదు. ఈనెల 8న సాయంత్రం వికారాబాద్ సభతో కేసీఆర్ ప్రచారం ముగిసే అవకాశం ఉంది.
ఇవాళ్టి నుంచి కేసీఆర్ తుదివిడత ప్రచారం ఇదీ చదవండి :సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత