నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో ఉదయం దొంగతనం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన సరోజ నిజామాబాద్‌లో తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లేందుకు నిర్మల్ వచ్చారు. ఆ మహిళ చేతిబ్యాగులో ఉన్న సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బస్సు దిగే సమయంలో చాకచక్యంగా నగలు కొట్టేశారు. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల దొంగలను గుర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. తమ వెనుక కూర్చున్న మహిళే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని బాధితురాలు అనుమానిస్తున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిర్మల్ బస్టాండ్‌లో బంగారం మాయం - nirmal bustand
శుభకార్యానికి వెళ్లేందుకు ఓ మహిళ నిర్మల్ బస్టాండ్‌కు వచ్చింది. నిజామాబాద్ బస్సు ఎక్కింది. కానీ..బస్సు దిగేలోపు ఆమె బ్యాగులో బంగారం మాయమైంది.
బంగారం మాయం