ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతు కుటుంబీకులు ఈ చిన్నారులు.. కరోనా కారణంగా పాఠశాలకు సెలవులిచ్చినా.. ఇంటి దగ్గర ఆడుకోకుండా.. ఇలా వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద వరుసలో నిలబడ్డారు. తమ కుటుంబీకులు పండించిన శనగ పంటను అమ్ముకునేందుకు వారికి బదులుగా వ్యవసాయశాఖ అందిస్తున్న టోకెన్ల కోసం గంటల తరబడి బారులు తీరారు.
శనగ పంట టోకెన్ల కోసం పసివాళ్ల పాట్లు - శనగ పంట
కరోనా నేపథ్యంలో బడికి సెలవిచ్చారు.. కానీ ఆ చిన్నారులు ఇళ్ల దగ్గర ఆడకోవడం లేదు.. కారణం ఏమిటంటే తమ తల్లిదండ్రులకు తోడుగా శనగ పంటను అమ్ముకోవడానికి టోకెన్ల కోసం గంటల తరబడి బారులు తీరారు. ఈ దృశ్యం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తారసపడింది.
శనగ పంట టోకెన్ల కోసం పసివాళ్ల పాట్లు
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో సోమవారం చిన్నారులు ఇలా పత్రాలు తీసుకొచ్చి పెద్దలతో పోటీ పడి టోకెన్లు పొందారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో నాలుగుకు చేరిన కరోనా కేసులు