తెలంగాణ

telangana

పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట.. 23 చెక్​పోస్టుల ఏర్పాటు

పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. నిర్మల్​- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 3, అంతర్​ జిల్లాలో 20చెక్ పోస్టుల ఏర్పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Jul 23, 2020, 10:44 AM IST

Published : Jul 23, 2020, 10:44 AM IST

checkposts arranged in nirmal district to stop the illegal transportation of animals
పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట.. 23 చెక్​పోస్టుల ఏర్పాటు

అక్రమంగా పశువుల రవాణాకు పాల్పడినవారిపై కఠిన చర్యలతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ అధికారుల పర్యవేక్షణలో విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దులోని మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం 24x 7 వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. వీటితోపాటు అంతర్ జిల్లాలోని 20 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు, పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details