నిర్మల్ జిల్లా మామడ మండలకేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
'చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి' - Chakali Ailamma birth anniversary in nirmal
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర రజక సంఘం డిమాండ్ చేసింది. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది.

చాకలి ఐలమ్మ జయంతి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా చాకలి ఐలమ్మ.. చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించారని రజక సంఘం సభ్యులు అన్నారు. వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ లోస్ర, మండల అధ్యక్షుడు రాజేశ్వర్, మాజీ సర్పంచ్ బాపయ్య, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రజక సోదరులు పాల్గొన్నారు.