తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(హైదరాబాద్) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ నిర్మల్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఫిబ్రవరి 1న గురుకుల, కళాశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు, సూచనలు ఇస్తూ, సిబ్బంది అప్రమతంగా ఉండాలని సూచించారు.
ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, వెబినార్ తరగతుల హాజరు పట్టికలు, యాదగిరి విద్యా టీ-శాట్ తరగతుల హాజరు పట్టికల్ని ఆయన పరిశీలించారు. గురుకుల విద్యాలయాన్ని పూర్తిస్థాయిలో కలియ తిరిగారు. తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, డార్మెటరీలను పరిశీలించారు. గురుకులాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి.. ప్రణాళికబద్ధంగా పాఠాలను బోధించాలని తెలిపారు.