నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో సారంగపూర్ మండలం గోపాల్‌పేటలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 57 ద్విచక్రవాహనాలు, 7 ఆటోలు, రూ. 13,480 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీల ద్వారా శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు నేరాల నియంత్రణతోపాటు నిందితులను గుర్తించొచ్చని ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. గ్రామస్థులందరూ కలిసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తనిఖీల్లో అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
"ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు" - cardon search
నిర్మల్ జిల్లా గోపాల్పేట గ్రామంలో నిర్వహించిన నిర్బంధ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 57 ద్విచక్రవాహనాలు, 7 ఆటోలు, రూ. 13,480 విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు"