తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు పల్టీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి - Car flown employee killed on the spot at nirmal district

అదుపుతప్పి కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద జరిగింది. ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి అర్జున్ రావు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

accident

By

Published : Nov 9, 2019, 9:53 AM IST

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహాబూబ్​ఘాట్ వద్ద కారు అదుపు తప్పి లోయలో పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. నిర్మల్ ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్​గా పనిచేస్తున్న అర్జున్​రావు, మరో ఇద్దరు ఫీల్డ్ ఆఫీసర్లు ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కారులో ప్రయాణిస్తున్న అర్జున్ రావు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు ఫీల్డ్ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. మృతి చెందిన అర్జున్ రావుది బోధన్​లోని సాలూరు. క్షతగాత్రులను నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

కారు పల్టీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి

ఇదీ చూడండి : పెయింట్​ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్​ జాగ్రత్త!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details