తెలంగాణ

telangana

ETV Bharat / state

లేగదూడ పొదుగు నుంచి పాలు.. - నిర్మల్​ జిల్లా

అప్పుడే పుట్టిన లేగ దూడ తల్లి వద్ద పాలు తాగడం చూస్తుంటాం. అందుకు విరుద్ధంగా కొన్ని రోజుల వయసున్న లేగదూడే పాలు ఇస్తోంది. నిర్మల్​ జిల్లా లోలంలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది.

లేగదూడ పొదుగు నుంచి పాలు..
లేగదూడ పొదుగు నుంచి పాలు..

By

Published : Feb 22, 2020, 7:49 PM IST

Updated : Feb 22, 2020, 7:56 PM IST

లేగదూడ పొదుగు నుంచి పాలు..

నిర్మల్​ జిల్లా దిలావర్​పూర్​ మండలం లోలం గ్రామానికి చెందిన అజారుద్దీన్​కు పాడి పరిశ్రమ ఉంది. జెర్సీ ఆవులను పెంచుతూ పాల వ్యాపారం చేస్తుంటాడు. సుమారు 5 రోజుల క్రితం ఓ ఆవుకు లేగదూడ జన్మించింది. శుక్రవారం సాయంత్రం ఆ లేగదూడ పొదుగు పరిమాణం పెద్దది కావడం గమనించాడు ఆ రైతు. అది తడిమి చూడగా పాలు ధారల రావడం చూసివిస్తుపోయాడు.

హార్మోన్ల ప్రభావంతోనే ఇలాంటివి జరుగుతాయని జిల్లా పశు వైద్యాధికారి రమేశ్​ తెలిపారు. ఈ ప్రభావంతో లేగదూడ ఆరోగ్యం పాడయి.. మరణించే అవకాశం కూడా ఉందన్నారు. స్థానికులు మాత్రం ఆ లేగదూడకు పూజలు చేస్తున్నారు.

ఇవీ చూడండి:బయో ఏసియా: పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు

Last Updated : Feb 22, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details