మొదట చూడగానే అరె.. అదేంటి, ఒక గేదె మరో గేదెను అలా పొడిచేస్తుంది. ఏమైంది? ఎందుకలా చేస్తోంది? పశువులు కూడా ఇలా దాడి చేసుకుంటాయా, వెన్నుపోటు పొడుస్తాయా.... లాంటి సందేహాలన్నీ మనలో మొదలవుతాయి. కానీ, చూడగానే ఏ విషయాన్నీ గుడ్డిగా నమ్మొద్దు. లేకపోతే ఇలాంటి అనుమానాలే పెరుగుతాయి. అపార్థాలు ఆస్కారమవుతాయి. నమ్మశక్యంగా లేదు కదా.. ఇది చూస్తే మీకే అర్థమవుతది.
ప్రతి జీవిలోనూ ఉంది.. అది గేదైనా.. ఏదైనా - buffello head insert into machine
ప్రాణం ఎవరిదైనా ప్రాణమే.. అది మనిషైనా.. జంతువైనా.. పశువులు కూడా తోటి వాటి పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉంటాయనడానికి.. నిర్మల్లోని ఈ సంఘటన నిదర్శనమైంది. ప్రమాదంలో ఉన్న గేదెను బయటకు తీసేందుకు మరో గేదె చేసే ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది.

నిర్మల్ శ్రీనగర్ కాలనీ సమీపంలో చెరకురసం తీసే యంత్రంలో చెరకు ముక్కలు మిగిలిపోయాయి. అటుగా వెళ్తున్న గేదెల గుంపు వాటిని గమనించి తినేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఒక గేదె కొమ్ములు యంత్రంలో ఇరుక్కుపోయి.. బయటకు తీసుకోలేక సతమతమైంది. దీన్ని గమనించి మరో గేదె.. ఎలాగైనా బయటకు తీసుకురావాలని వెనక నుంచి పొడుస్తోంది. అలా అని దాన్ని గాయపర్చలేదు. మనుషుల్లాగా ఆలోచించే శక్తి వీటికి లేకపోయినా... తమ వల్ల చేయగలగినది చేసే ప్రయత్నం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదీ చూడండి:భద్రత లేని ఏటీఎం చోరీ.. 2 లక్షల నగదు మాయం!