నిర్మల్ జిల్లా సోన్ మండలంల కడ్తాల్ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంచినీటి ట్యాంకు నుంచి నీరు వృథాగా పోతుంది. నీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్కు లీకేజీ ఏర్పడటం వల్ల కొన్ని రోజుల నుంచి తాగునీరు నేలపాలవుతోంది. పాఠశాల ఆవరణ మొత్తం బురదమయంగా మారింది. ఫలితంగా విద్యార్థులకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
పగిలిన నీటి ట్యాంక్ పైప్‌లైన్.. వృథాగా పోతున్న నీరు - నిర్మల్ జిల్లాలో పగిలిన నీటి ట్యాంక్ పైప్‌లైన్
మైళ్లకొద్దీ దూరం వెళ్లి బిందెడు నీటిని తెచ్చుకునే దృశ్యాలు మనకు ఎక్కడోచోట కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ నీటిబొట్టును జాగ్రత్తగా కాపాడుకుంటూ వినియోగించుకోవాలి. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ పంచాయతీ పరిధిలోని ఈ దృశ్యాలు.
పగిలిన నీటి ట్యాంక్ పైప్‌లైన్.. వృథాగా పోతున్న నీరు
పక్షం రోజులు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. అధికారులు ఇప్పుడైనా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు పేర్కొన్నారు.