కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి.మార్కెట్లో టమాట తప్ప మిగతా కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఇక వంకాయ సెంచరీకి చేరువైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో కిలో వంకాయ ధర రూ. 80 నుంచి రూ.100 పలుకుతోంది. ఇతర వాటితో పోలిస్తే వంకాయ ధర పైపైకి ఎగబాకుతోంది. ఈ కూరగాయల రాజును కొనాలంటేనే వినియోదారులు జంకుతున్నారు. దిగుబడి తగ్గడం, గణేశ్ నవరాత్రి ఉత్సవాల సమయంలో పెరిగిన నిత్యాన్నదానాల కారణంగా వంకాయ డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ఇతర రోజుల్లో కిలోకు 30 రూపాయలు ఉండే ధర ఇప్పుడు మూడు రేట్లు పెరిగిపోయింది.
వందకొట్టు.. వంకాయ పట్టు - nirmal
కూరగాయలకు రాజు ఎవరంటే... ఠక్కున చెప్పేసే పేరు వంకాయ. అయితే ఆ వంకాయ ఇప్పుడెంతో ప్రియమైంది. లొట్టలేసుకుని తినేసే వారిప్పుడు ఒక్కసారి ఆలోచించేస్తున్నారు. షాపుకెళ్లి వంకాయలు కిలో ఎంతని అడిగే... "వందకొట్టు.. వంకాయ పట్టు" అనే సమాధానం వినిపిస్తోంది.
![వందకొట్టు.. వంకాయ పట్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4403049-thumbnail-3x2-br.jpg)
వంద కొట్టు.. వంకాయ పట్టు