నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో పెళ్లి కొడుకు కనిపించకపోవడం వల్ల ఆ వివాహం ఆగిపోయింది. ముధోల్‌కు చెందిన సంతోశ్‌కు, లోకేశ్వరం మండలం పొట్ పెల్లికి చెందిన అమ్మాయితో గత నెల క్రితం వివాహం కుదిరింది. ఇవాళ ముధోల్లోని జీఏం కల్యాణ మండపంలో వివాహం జరగనుండగా.. మంగళవారం రాత్రి నుంచి సంతోష్ కనిపించకుండా పోయాడు.
పెళ్లి కొడుకు మిస్సింగ్..సినిమా సీన్‌ను తలపించిన ఘటన
మంగళ వాయిద్యాలు.. పురోహితుల మంత్రోచ్ఛరణలు.. బంధువుల హంగామాతో వివాహ వేడుక ముచ్చటగా జరుగుతోంది. ఇంతలో పెళ్లి కొడుకు కనిపించట్లేదని ఓ పిలుపు వినబడింది. అందరూ ఏమైంది అని ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా సినిమా సీన్లా ఉన్నా..రియల్ లైఫ్‌లో జరిగింది.
పెళ్లి కొడుకు మిస్సింగ్.. సినిమా తరహాలో సంఘటన
ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇల్లరికం వివాహం అయినందునే ఇష్టం లేక పారిపోయి ఉండవచ్చని కుటుంబీకులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి:మాయమాటలు చెప్పింది... మాయం చేసింది..!!