తెలంగాణ

telangana

Brahma Kamalam: పదేళ్ల నిరీక్షణకు మోక్షం.. భైంసాలో వికసించిన అరుదైన పుష్పం

By

Published : Aug 1, 2021, 9:45 PM IST

అదో అరుదైన పుష్ఫం.. ఎన్నో ఏళ్లకు గానీ వికసించని ప్రత్యేక పువ్వు.. ఏకంగా దశాబ్దపు నిరీక్షణ అనంతరం ఆ పుష్పం వికసించింది. ఈ అద్భుత ఘట్టానికి నిర్మల్​ జిల్లా భైంసా పట్టణం వేదిక అయ్యింది.

brahma-kamalam-flower-blooms-in-bhainsa-city-after-10-years
brahma-kamalam-flower-blooms-in-bhainsa-city-after-10-years

పదేళ్ల నిరీక్షణకు మోక్షం.. భైంసాలో వికసించిన అరుదైన పుష్పం
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మార్వాడీ గల్లీలో అరుదైన పుష్పమైన బ్రహ్మ కమలం విరబూసింది. పట్టణానికి చెందిన మహేశ్​ పురోహిత్​కు మహారాష్ట్రలోని తన అన్నయ్య బ్రహ్మకమలం మొక్కను పంపించాడు. ఈ బ్రహ్మ కమలం మొక్కను 10 ఏళ్లుగా మహేశ్​ పురోహిత్​ ఎంతో జాగ్రత్తంగా పెంచుతున్నాడు. అరుదైన పుష్పాన్ని తిలకించేందుకు మహేశ్​ కుటుంబసభ్యులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి వేచిచూస్తోన్న ఆ బ్రహ్మ ఘడియలు రానే వచ్చాయి.

రాత్రి వికసించే పుష్పంగా పేరుగాంచిన ఈ అపురూపమైన బ్రహ్మకమలాలు.. శనివారం రాత్రి 9 గంటల సమయంలో వికసించాయి. ఒక దాని వెనుక ఒకటి వికసిస్తూ నాలుగు పువ్వులు పూశాయి. ఎంతో అరుదైన పుష్పాలు తమ ఇంట్లో వికసించటం ఎంతో ఆనందంగా ఉందని మహేశ్ కుటుంబసభ్యులు తెలిపారు. బ్రహ్మకమలాలు వికసించటం చూసేందుకు ఎన్నో ఎళ్లుగా ఎదురుచూస్తున్న తాము ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఎన్నో ఏళ్లకు గానీ.. వికసించని ఆ పుష్పాలకు పూజలు నిర్వహించాలని కుటుంబపెద్దలు సూచించటం వల్ల భక్తి శ్రద్ధలతో పూజలు చేసినట్టు మహేశ్​ తెలిపాడు. ఈ విషయం తెలిసి చుట్టూ ప్రక్కల ప్రజలు కూడా పుష్పాలను వీక్షించేందుకు తరలివస్తున్నారని తెలిపారు. ఈ పుష్పాలను చరావాణుల్లో ఫొటోలు తీసుకుని ఆనందిస్తున్నారని మహేశ్​ పేర్కొన్నాడు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details