తెలంగాణ

telangana

ETV Bharat / state

దుర్గామాతకు.. వైభవంగా బోనాల జాతర - నిర్మల్​ జిల్లా వార్తలు

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్​ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ప్రతిష్టించిన దుర్గాదేవికి గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. విశేష పూజలు చేసి.. కాపాడమని వేడుకున్నారు.

Bonalu festival in nirmal district
దుర్గామాతకు.. వైభవంగా బోనాల జాతర

By

Published : Oct 20, 2020, 9:46 PM IST

నిర్మల్​ జిల్లా మామమ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో చైతన్య యూత్​ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి గ్రామస్థులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం దుర్గామాతకు వైభవంగా బోనాల జాతర నిర్వహించారు.

ప్రత్యేకంగా వండిన నైవేద్యాన్ని దుర్గామాతకు సమర్పించి.. బాజా భజంత్రీల నడుమ గ్రామంలో ఊరేగిస్తూ.. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు సమర్పించారు. కాపాడమని వేడుకుంటూ సారె అప్పజెప్పి కోరుకున్నారు.

ఇదీ చదవండి:వరద సమస్యకు శాశ్వత పరిష్కారం: మంత్రి సబితా

ABOUT THE AUTHOR

...view details