ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను ఆదుకోవాలంటూ భారతీయ జనతా యువ మోర్చా నాయకులు నిర్మల్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. భావిపౌరులను తయారుజేసే ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి కారణంగా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రవేటు టీచర్లను ఆదుకోవాలి: బీజేవైఎం - నిర్మల్‌లో బీజేవైఎం ధర్నా
ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలంటూ బీజేవైఎం నాయకులు నిర్మల్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భావి పౌరులను తయారుచేసే ఉపాధ్యాయులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
![ప్రవేటు టీచర్లను ఆదుకోవాలి: బీజేవైఎం bjym leaders protest at nirmal collectorate for private teachers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9230789-394-9230789-1603096358234.jpg)
ఉపాధి కోల్పోయి టీచర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, నాయకులు అనుముల శ్రవణ్, కొండాజీ శ్రవణ్, గిల్లి విజయ్, వెంకటేష్, జక్కుల గజేందర్, అల్లం భాస్కర్, సాయినాథ్ పాటిల్, ప్రవీణ్, భరత్, శివ చారి, చిన్నోళ్ల ప్రశాంత్, సాగర్, మనీష్, ప్రైవేటు ఉపాధ్యాయులు గొనుగొప్పుల కిషన్, తక్కలపల్లి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఊహించని ఉపద్రవం.. అందని సాయం.. ఆ కుటుంబాల్లో అంధకారం