కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ జిల్లాకు రానున్న నేపథ్యంతో ఆయన పర్యటించారు. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా సభ నిర్వహించేందుకు స్థానిక నేతలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
Tharun chug: తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: తరుణ్ చుగ్ - ప్రజా సంగ్రామ యాత్ర
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ గుండెల్లో దడ మొదలైందని రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ఈ నెల 17న నిర్మల్ వేదికగా అమిత్ షా శంఖారావం మోగించనున్నారని తెలిపారు. కేంద్రమంత్రి పర్యటనకు స్థలాన్ని ఆయన పరిశీలించారు.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని తరుణ్ చుగ్ ఆరోపించారు. కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించేందుకే నిర్మల్ వేదికగా కొత్త చరిత్రకు నాంది పలకబోతున్నట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో ముఖ్యమంత్రి గుండెల్లో భయం మొదలైందన్నారు. తెలంగాణలో రామరాజ్యం స్థాపనకు అమిత్ షా శంఖారావం పూరించనున్నారని తెలిపారు. త్వరలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:tarun chugh: రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం