తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే సీఎం అవుతారని చెప్పి.. కేసీఆర్ ఎస్సీలను మోసం చేశారంటూ నిర్మల్ జిల్లాలోని భాజపా నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా దళిత మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
సీఎం కేసీఆర్కు దళితులంటే గౌరవం లేదని నేతలు ఆరోపించారు. మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాలో దళితులకు కేటాయించిన భూమిలో.. పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని విమర్శించారు.