తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​ జిల్లాలో భాజపా నాయకుల ఆందోళన - laxmanachanda latest news

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్ట్​కు నిరసనగా నిర్మల్​ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రంలో భాజపా ఆందోళన చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

bjp protest at laxmanachanda in nirmal district
లక్ష్మణచాందాలో భాజపా నాయకుల ఆందోళన

By

Published : Oct 27, 2020, 3:02 PM IST

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రంలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్ట్​కు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ని సిద్దిపేట బస్టాండ్​కి రావాలని సవాల్ విసిరి.. ఇప్పుడు సిద్దిపేటకు వస్తే అరెస్ట్​ చేయడం మంచిది కాదని భాజపా నాయకులు అన్నారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే భాజపా నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details