ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు భాజపా నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నింపుకోవడం కోసమే ఎల్ఆర్ఎస్ తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల నడ్డి విరిచి.. వారిపై అదనపు భారం మోపేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని.. భాజపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ వల్ల పేదల మీద అదనపు భారం : భాజపా నేత రాంనాథ్ - భాజపా ధర్నా
నిర్మల్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు భాజపా ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద ప్రజల నడ్డి విరిచి.. కబ్జాకోరులకు మేలు చేసేందుకే.. ఎల్ఆర్ఎస్ తెచ్చారంటూ భాపజా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్ వల్ల పేదల మీద అదనపు భారం : భాజపా నేత రాంనాథ్
పైసా పైసా పొదుపు చేసి సొంతింటి కోసం ఫ్లాట్ కొనుక్కుంటే.. పేదల ఆశ మీద ప్రభుత్వం నీళ్లు చల్లుతుందని ఆరోపించారు. తెరాస నాయకులకు , భూకబ్జాదారులకు లబ్ది పొందేలా ప్రభుత్వ భూములు, లావన్ పట్టా భూములు ఎల్ఆర్ఎస్ పేరుతో అప్పగించేందుకు.. ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష