దేశంలో భాజపా చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని సభ్యత్వ నమోదు ఇంఛార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు అన్నారు. దేశాన్ని 70 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్కు జాతీయ అధ్యక్షుడు కరవయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని తెలిపారు. సభ్యత్వ నమోదు ముమ్మరం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయనున్నట్లు తెలిపారు.
'తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం' - NIRMAL
తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు అన్నారు.
'తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం'