భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ బుధవారం నిర్మల్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధ్యక్షురాలు డా. పడకంటి రమాదేవి పార్టీ నేతలతో కలసి వెయ్యి ఉరులమర్రి స్మారకస్థలాన్ని సందర్శించారు. వేదికను పరిశీలించారు. పోరాట యోధుల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. మజ్లిస్‌కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని విమర్శించారు.
త్యాగాలను విస్మరిస్తున్నారు: పడకంటి రమాదేవి - నిర్మల్ జిల్లా వార్తలు
తెలంగాణ కోసం పోరాడిన నాటి ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం విస్మరిస్తోందని నిర్మల్ భాజపా జిల్లా అధ్యక్షురాలు డా. పడకంటి రమాదేవి అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ బుధవారం నిర్మల్ పర్యటన నేపథ్యంలో వెయ్యి ఉరులమర్రి స్మారకస్థలాన్ని పార్టీ నేతలతో కలసి సందర్శించారు.
![త్యాగాలను విస్మరిస్తున్నారు: పడకంటి రమాదేవి bjp nirmal district president ramadevi fire on trs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8728405-0-8728405-1599575420163.jpg)
త్యాగాలను విస్మరిస్తున్నారు: పడకంటి రమాదేవి
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీగోండు సహా వెయ్యి మందిని ఒకే మర్రి చెట్టుకు ఉరి తీసిన ప్రాంతమే నేడు వెయ్యి ఉరులమర్రిగా మారిందని గుర్తు చేశారు. బుధవారం నాటి కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి :సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో కాలుష్య ప్రభావంపై నిపుణుల కమిటీ