తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాజపా పాలిత రాష్ట్రాల్లో బోనస్ ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకివ్వరు?'

MP ARVIND ON PADDY: రాష్ట్రంలో తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. బ్లాక్ మార్కెట్‌తో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో యాసంగి పంటకు బోనస్ ఇస్తుంటే మీరేందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. భైంసా అల్లర్ల తర్వాత భాజపా కార్యకర్తలను కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు ఫిర్యాదు చేశారు.

MP ARVIND ON PADDY
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌

By

Published : Dec 9, 2021, 3:56 PM IST

MP ARVIND ON PADDY: బ్లాక్ మార్కెట్‌తో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో తరుగు పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో యాసంగి పంటకు బోనస్ వస్తోందని అర్వింద్‌ తెలిపారు. తెలంగాణలో బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. సినిమాల్లో లాగా కేటీఆర్‌ కూడా సినిమా డైలాగులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోచుకుంటుంటే తెరాస నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఎంఐఎం ఆదేశాలతో కార్యకర్తలపై కేసులు

arvind on bhainsa riots: భైంసా అల్లర్ల తర్వాత భాజపా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై కఠినచట్టాల కింద కేసులు నమోదు చేశారని ఫిర్యాదులో వివరించారు. తెరాస ప్రభుత్వం అండతో ఎంఐఎం నేతల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు.

జైళ్లో పెట్టి వేధిస్తున్నారు

MP Arvind complaint: భాజపా కార్యకర్తల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ అమిత్ షాను కోరినట్లు అర్వింద్ తెలిపారు. గతేడాది మార్చి 14న భైంసాలో హిందువులపై ఎంఐఎం నాయకులు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. నలుగురిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి చంచల్ గూడ జైల్లో నిర్భంధించారని వివరించారు.

తెలంగాణలో తరుగు పేరుతో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోచుకుంటుంటే అధికార పార్టీకి చెందిన ఒక్క శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు ఎందుకు మాట్లాడడం లేదు. బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం లేకపోతే రైతులకు అన్యాయం చేస్తుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లో యాసంగి పంటకు బోనస్ ఇస్తుంటే... తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదు. సినిమా యాక్టర్లతో తిరిగి కేటీఆర్‌ కూడా... సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడు. తరుగు పేరుతో గత మూడు సంవత్సరాల నుంచి రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు. మిల్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థతో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు?- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details