భైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని భాజపా ఎంపీలు సోయం బాబురావు, అర్వింద్‌తో పాటు పలువురు పార్టీ నేతలు... డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని.. స్థానిక సీఐని బదిలీ చేయాలని కోరగా డీజీపీ సానుకూలంగా స్పందించారని ఎంపీ సోయం బాబురావు తెలిపారు.
భైంసా ఘటనపై విచారణ జరిపించాలని డీజీపీని కోరిన భాజపా నేతలు
డీజీపీ మహేందర్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ నేతలు కలిశారు. భైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
bjp mps and leaders meet dgp
కేసీఆర్ ప్రభుత్వం అధిక సెక్యులరిజాన్ని పాటిస్తోందని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. భైంసాలో జరగుతున్న ఘటనలకు ఎంఐఎం నేతలే కారణమని ఆరోపించారు. 2023లో భాజపా అధికారంలోకి వచ్చాక మజ్లిస్ పని పడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :భైంసాలో చెలరేగిన అల్లర్లు