నిర్మల్ జిల్లా కేంద్రం విద్యుత్ కార్యాలయం ముందు అధిక కరెంటు బిల్లులను నిరసిస్తూ భాజపా నాయకులు నిరసన చేశారు. విద్యుత్ ఛార్జీలు రద్దుచేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో అనేక మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు అన్నారు. అది దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించాలని కోరారు.
'కరోనా సమయంలో పేదలపై పెనుభారం మోపడం సరికాదు'
లాక్డౌన్ సమయంలో అధిక విద్యుత్ బిల్లుల వసూలును నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అధిక కరెంటు బిల్లులను నిరసిస్తూ ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల వసూలు విషయంలో రాయితీలను మరిచిందన్నారు. నెలకు రూ. 200 కట్టేవారికి సైతం వేలల్లో బిల్లులు వచ్చాయని అన్నారు. మూడు నెలలకు ఒకసారి మీటరు రీడింగ్‌లో కేటగిరీ విధానం మారుతుందన్నారు. పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, సమ రాజేశ్వర్ రెడ్డి, ఒడిసెల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మరోసారి లాక్డౌన్ విధించే ఉద్దేశం లేదు: మంత్రి ఈటల