కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బీజేవైఎం చేపట్టిన ఆందోళన చేపట్టారు. కాగా అలాంటి కార్యక్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సరికాదని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కరిపే విలాస్ అన్నారు.
బీజేవైఎం నాయకులపై పోలీసుల లాఠీఛార్జ్ సరికాదు: భాజపా నేతలు - సారంగాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా నేతలు నిరసన
ప్రైవేటు ఉపాధ్యాయుల తరఫున పోరాటం చేస్తున్న బీజేవైఎం నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సరికాదంటూ నిర్మల్ జిల్లా సారంగాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపానేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేటు అధ్యాపకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండిస్తూ సారంగాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు అఖిల్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చాణక్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వినోద్, కార్యదర్శి రాధాకృష్ణ, సీనియర్ నాయకులు రాథోడ్ ఉమేష్, సోషల్ మీడియా మండల కన్వీనర్ వెలిశాలి తిరుమల చారి, సాయినాథ్, మీరా తేజ, మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు రాజ్ మహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:భాజపాలో చేరిన తెరాస నేత ఉడుత మల్లేశం యాదవ్