షరతులు లేకుండా రైతుబంధు అమలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. రెండో సారి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. నేటికీ రుణమాఫీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.
'రైతుబంధు నగదును వెంటనే ఖాతాల్లో జమచేయాలి' - నిర్మల్ జిల్లా వార్తలు
రైతుబంధు నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. రుణమాఫీ వెంటనే అమలు చేయాలని భాజపా నాయకులు కోరారు.
'రైతుబంధు నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలి'
రైతుబంధు నగదును వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, ఒడిసెల శ్రీనివాస్, సామ రాజేశ్వర్ రెడ్డి, అయ్యన్నగారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పింఛన్ల కోతపై హైకోర్టులో విచారణ