నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ భాజపా నేతలు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీని కలిసి వినతి పత్రం అందించారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవటం వల్ల... రైతులు కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారని భాజపా జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి తెలిపారు.
'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయండి' - మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారని భాజపా నేతలు పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు.
!['మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయండి' bjp leaders demands for Corn buying centers in nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11343554-974-11343554-1617973166089.jpg)
'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయండి'
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.