'పోరాట యోధుల చరిత్ర భావితరాలకు తెలియాలి' - bjp leader says that next generation should know about telangana fighters
తెలంగాణ యోధుల చరిత్ర భావితరాలకు తెలియనీకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని నిర్మల్ జిల్లా భాజపా నేత రావుల రాంనాథ్ ఆరోపించారు. నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన యోధులకు తగిన ప్రాచుర్యం కల్పించాలన్నారు.
'పోరాట యోధుల చరిత్ర భావితరాలకు తెలియాలి'
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సవాల్ స్వీకరించకుండా విమోచన దినోత్సవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని నిర్మల్ జిల్లా భాజపా నేత రావుల రాంనాథ్ ఆరోపించారు. నిర్మల్లో భాజపా ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : తెలంగాణ భవన్లో జాతీయజెండాను ఆవిష్కరించిన కేటీఆర్