ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో అభివృద్ధి చెందిన భారత్ వైపు.. ప్రపంచ దేశాలు చూస్తున్నాయని భాజపా నిర్మల్ పట్టణ అధ్యక్షుడు సాడం అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలో భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి సంబురాలు జరుపుకున్నారు.
'ఇద్దరు ఎంపీలతో మొదలై.. 300 పైగా పార్లమెంటు స్థానాలు' - telangana news
నిర్మల్ జిల్లా కేంద్రంలో భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి సంబురాలు జరుపుకున్నారు.
నిర్మల్లో భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడినప్పుడు ఈ పార్టీ ఏం చేస్తుందని కొందరు అవహేళన చేశారని అరవింద్ అన్నారు. ఇద్దరు ఎంపీలతో మొదలై ఈరోజు 300 పైచిలుకు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని, దేశంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మె రాజు, ఒడిసెల అర్జున్, రాజు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు