తెలంగాణ

telangana

ETV Bharat / state

20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత - ప్రజాపంపిణీ బియ్యం

నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు బియ్యం అక్రమ వ్యాపారులపై కొరడా ఝళిపించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత

By

Published : Aug 8, 2019, 12:35 PM IST

Updated : Aug 8, 2019, 1:08 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు కలిసి ప్రజాపంపిణీ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై దాడులు నిర్వహించారు. పట్టణంలోని గాజుల్​పేటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. గత నెలరోజుల వ్యవధిలో 15 కేసులు నమోదు చేశారు. 325 క్వింటాళ్ల బియ్యం, 600 లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్​కుమార్ తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని కొన్నా, విక్రయించినా చట్టవ్యతిరేకమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే 73307 74444 నెంబరుకు వాట్సప్ చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు.

20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం పట్టివేత
Last Updated : Aug 8, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details