తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసా బాధిత కుటుంబాలకు.. భాజపా ఎన్నారై సెల్ ఆర్థిక సహాయం - భైంసా బాధిత కుటుంబాలకు భాజపా ఆర్థిక సహాయం

గత నెల భైంసాలో జరిగిన అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వారికి తెలంగాణ భాజపా ఎన్నారై సెల్ ఒమన్ ఆర్థిక శాఖ సహాయం చేసింది. బాధిత కుటుంబాలకు 2 లక్షల 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

bhainsa bjp financial Assistance for Non-Violent Families at nirmal district
భైంసా బాధిత కుటుంబాలకు.. భాజపా ఎన్నారై సెల్ ఆర్థిక సహాయం

By

Published : Feb 29, 2020, 6:51 PM IST

నిర్మల్ జిల్లా భైంసాలో గత నెల జరిగిన అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వారికి తెలంగాణ భాజపా ఎన్నారై సెల్ ఒమన్ ఆర్థిక శాఖ సహాయం చేసింది. తెలంగాణ ఎన్నారై సెల్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు బాధిత కుటుంబాలకు 2 లక్షల 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఒమాన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల ఆధ్వర్యంలో కార్యకర్తలు స్పందించి విరాళం అందించారని ఆయన తెలిపారు. ఎన్నారైలు బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ భాజపా అధ్యక్షురాలు డా. పడకంటి రమాదేవి, ఒమన్ భాజపా నాయకులు పాల్గొన్నారు.

భైంసా బాధిత కుటుంబాలకు.. భాజపా ఎన్నారై సెల్ ఆర్థిక సహాయం

ఇదీ చూడండి :డబుల్ బెడ్​రూం కోసం.. తెలంగాణ భవన్ వద్ద ఆందోళన

ABOUT THE AUTHOR

...view details