భైంసా అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాల్లో ఇప్పటికీ భయం పోలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే అన్నారు. భైంసా అల్లర్లకు మతం రంగు పులి.. ఘటనను పక్కదారి పట్టించేలా కొంత మంది చూస్తున్నారని ఆరోపించారు. పథకం ప్రకారమే ఈ అల్లర్లు చేసినట్లు అనుమానం వస్తోందని చెప్పారు.
చిన్నారుల చదువుకు సంబంధించిన ధ్రువపత్రాలు మంటల్లో కాలిపోయాయని... ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు కూడా నిలిచిపోయాని ప్రజ్ఞా పరాండే ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో నెలకొన్న అభద్రతా భావం, భయాందోళన నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.