నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం మహర్షి భగీరథ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. భగీరథ చిత్ర పటానికి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహర్షి భగీరథ ఋషి జీవిత చరిత్రను స్మరించుకున్నారు.
కలెక్టరేట్లో నిరాడంబరంగా భగీరథ జయంతి వేడుకలు - bhagiratha jayanthi celebration in collectorate
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహర్షి భగీరథ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే అందరూ వేడుకల్లో పాల్గొన్నారు.
కలక్టరేట్లో నిరాడంబరంగా భగీరథ జయంతి వేడుకలు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే అందరూ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం