Basara RGUKT: బాసర విద్యార్థుల నిరసన ఇంకా కొనసాగుతోంది. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వర్షంలోనే విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ రాత్రంతా నిరసన కొనసాగించాలని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Basara RGUKT: పట్టువీడని విద్యార్థులు.. రాత్రంతా నిరసన కొనసాగించాలని నిర్ణయం - నిరసన
18:54 June 19
basara: సీఎంవో నుంచి అధికార ప్రకటన కోరుతున్నాం: విద్యార్థి శివకుమార్
సీఎంవో నుంచి అధికార ప్రకటన కోరుతున్నాం. ఇవాళ రాత్రంతా జాగరణ చేయాలని నిర్ణయించాం. మా 12 డిమాండ్లను సాధించుకునే వరకు పోరాడతాం. వర్షం వచ్చినా, ఉరుములు, మెరుపులొచ్చినా తగ్గేది లేదు.
- శివకుమార్, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన కొనసాగించేందుకు మొగ్గుచూపారు. రేపటి నుంచి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. యోగా, సాంస్కృతిక కార్యక్రమాలతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.