తెలంగాణ

telangana

ETV Bharat / state

BASARA RGUKT: వర్షంలోనూ కొనసాగుతున్న ఆందోళన.. అప్పటివరకు తగ్గేదేలే...! - బాసర ట్రిపుల్ ఐటీ

BASARA RGUKT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. డిమాండ్ల సాధన కోసం వరుసగా ఏడో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కొనసాగిస్తున్నారు. డిమాండ్లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

BASARA RGUKT
BASARA RGUKT

By

Published : Jun 20, 2022, 4:11 PM IST

BASARA RGUKT: బాసరలో విద్యార్థులు ఆందోళనలో ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా ఏడోరోజు కూడా ఆర్జీయూకేటీలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.

బాసర ఆర్జీయూకేటీలో వర్షంలోనూ తడుస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్‌ఐటీ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details