తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేడ్స్​ ఎఫెక్ట్​... ట్రిపుల్​ఐటీలో పెరగనున్న పోటీ - బాసర ట్రిపుల్ ఐటీ దరఖాస్తు వివరాలు

ఈసారి బాసర ట్రిపుల్​ఐటీలో సీట్ల కోసం విద్యార్థుల నుంచి పోటీ పెరగనుంది. సుమారు లక్ష మంది విద్యార్థులకు 10 జీపీఏ రావచ్చని విద్యాశాఖ అంచనా వేస్తోంది. వారంతా దరఖాస్తు చేసే అవకాశం కనిపిస్తోంది. పదో తరగతి గ్రేడ్లు ఇచ్చిన తర్వాత ఫలితాల వెల్లడి అనంతరం బాసర వర్సిటీ నోటిఫికేషన్‌ జారీచేయనుంది.

bsara iiit
bsara iiit

By

Published : Jun 10, 2020, 9:17 AM IST

ట్రిపుల్‌ఐటీగా పేరొందిన బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయాని(ఆర్‌జీయూకేటీ)కి ఈసారి విద్యార్థుల నుంచి డిమాండ్‌ అనూహ్యంగా పెరగనుంది. పదికి 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించేవారి సంఖ్య లక్షకు మించవచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో సీట్ల కోసం విద్యార్థులు పోటాపోటీగా దరఖాస్తు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈసారి రెట్టింపు

ఆర్‌జీయూకేటీలో తక్కువ రుసుముతో ఆరేళ్లపాటు ఇంటర్‌, బీటెక్‌ విద్య అభ్యసించేందుకు అవకాశం ఉంది. శాశ్వత బోధనా సిబ్బంది లేకున్నా పరిశోధనలు, ఆవిష్కరణలలోనూ వర్సిటీ అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రాంగణ నియామకాలు ఆశాజనకంగా ఉన్నాయి. గేట్‌లోనూ ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. ఫలితంగా ఇక్కడున్న 1,500 సీట్ల కోసం ఏటా 30వేల నుంచి 35వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. ఈసారి ఆ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని అంచనా. సాధారణంగా జూన్‌లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈసారి పదో తరగతి పరీక్షలు జరగకపోవడం వల్ల ఆలస్యమైంది. ఫలితాల వెల్లడి అనంతరం బాసర వర్సిటీ నోటిఫికేషన్‌ జారీచేయనుంది.

వారంతా పోటీనే

పదో తరగతిలో సాధించిన గ్రేడ్ల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ ఆర్‌జీయూకేటీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి అంతర్గత మార్కులు(ఎఫ్‌ఏ)లో వచ్చినవి ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించటంతో 10 జీపీఏ సాధించేవారి సంఖ్య లక్ష దాటొచ్చని విద్యాశాఖ వర్గాల అంచనా. సర్కారు బడుల్లో చదివిన విద్యార్థుల గ్రేడ్‌కు 0.40 గ్రేడ్‌ను అదనంగా కలిపి పరిగణిస్తూ ప్రవేశాలు కల్పిస్తారు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 జీపీఏ పొందేవారంతా పోటీపడనున్నారు.

ఇదీ చదవండి:10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ABOUT THE AUTHOR

...view details