నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గాడ్చందా గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు శుక్రవారం ఉదయం నుంచి యాగం నిర్వహించి రాత్రి మహా హారతి ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాసర వేద పీఠం వ్యవస్థాపకులు వేద విష్యనందగిరి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఋషికన్యలచే మహా హారతి చేపట్టారు. స్వామి వారు భారత సంస్కృతి సంప్రదాయంపై ప్రవచించగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. గ్రామస్థులు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు ఆంజనేయ ప్రసాదంగా స్వీకరించారు.
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు - harati
హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్మల్ జిల్లాలోని గాడ్చందా గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బాసర వేద పీఠం వ్యవస్థాపకులు వేద విష్యనందగిరి స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు