బాసరలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు - godhavari
బాసరలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రుషి కన్యలు హనుమాన్ చాలీసా పారాయాణం చేసి హారతులు ఇచ్చారు.
హనుమాన్ జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లాలోని బాసర గోదావరి తీరాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వేదభారతి పీఠం ఆధ్వర్యంలో జరిగిన పవన సుత హనుమాన్ జయంతి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హనుమాన్ చాలీసా చదివి.. యాగం చేసిన రుషికన్యలు ఆంజనేయినికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.