నిర్మల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద నిరసన చేపట్టారు. అక్కడి నుంచి జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. 2017 నవంబర్ నుంచి వేతన సవరణ జరగడం లేదన్నారు.
వారానికి ఐదు రోజులే పనిచేస్తాం..: బ్యాంకు ఉద్యోగులు - నిర్మల్ జిల్లా
నిర్మల్ జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు మాత్రమే కల్పించాలని డిమాండ్ చేశారు.
వారానికి ఐదు రోజులే పనిచేస్తాం..: బ్యాంకు ఉద్యోగులు
వారానికి ఐదు రోజుల పనిదినాలు మాత్రమే కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. విధులు నిర్వహించే సమయంలో సమయపాలన లేకుండా శ్రమదోపిడి చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:రాయితీల కోసం.. బయో మోసం..