తెలంగాణ

telangana

ETV Bharat / state

'మద్యం కోసం ఒక మహిళ రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం చూసి దేశం నవ్వుతోంది' - దిల్లీ మద్యం కేసు

Bandi Sanjay fire on kavitha: ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ చేస్తే సానుభూతితో గెలిచేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్​లో మాట్లాడిన ఆయన.. ఈ నెల 11న కేసీఆర్ బిడ్డ అసలు సంగతి తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Dec 7, 2022, 5:32 PM IST

Bandi Sanjay fire on kavitha: బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ వరకు చేరుకుంది. మొదట ఖానాపూర్​లో పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఆయనకు.. గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్​షోలో మాట్లాడిన బండి సంజయ్.. ఈ నెల 11న కేసీఆర్ బిడ్డ అసలు సంగతి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కవితను దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ చేస్తే సానుభూతితో గెలిచేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని ఆరోపించారు.

డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతికి, పోడు పట్టలకు, మంచినీళ్లకు లేని డబ్బులు.. మద్యం కోసం ఒక మహిళ రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం దేశం నవ్వుతోందని విమర్శించారు. కేసీఆర్ నియంత్రత్వ పాలనకు చరమ గీతం పాడటానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్ల్లు తెలిపిన ఆయన.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే నిర్మల్ జిల్లాలో పెండింగ్​లో ఉన్న సాధార్మాట్ కాలువ, కుప్టి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఖానాపూర్​లో డిగ్రీ కళాశాల, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు వచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వ ఇస్తుందని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో బడుగు బలహీన ప్రజల ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా 27 మంది బీసీలను 12 మంది ఎస్సీలను, 8 ఎస్టీలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని హర్షవ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీన కరీంనగర్​లో జరగబోయే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వస్తున్నారని ఆయన తెలిపారు.

"ఈరోజు నిరుద్యోగ భృతికి, పోడు పట్టలకు, మంచినీళ్లకు లేని డబ్బులు.. మద్యం కోసం ఒక మహిళ రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం దేశం నవ్వుతోంది. రాష్ట్రంలో ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. కేసీఆర్ ఉదయం లేచింది మొదలు మోదీని తిట్టడం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోరు. ఈరోజు దేశంలో 27 మంది బీసీలను 12 మంది ఎస్సీలను, 8 ఎస్టీలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది."-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నిర్మల్ జిల్లా ఖానాపూర్​లో బండి సంజయ్ ప్రసంగం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details