తెలంగాణ

telangana

ETV Bharat / state

హామీలు ఇవ్వటం తప్ప కేసీఆర్‌ ఏమీ పరిష్కరించరు: బండి సంజయ్‌ - Bandi Sanjay Prajasangrama Yatra Latest News

Bandi Sanjay comments on CM KCR: బండి సంజయ్ తనదైన శైలిలో సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి హామీలు ఇవ్వటం తప్ప .. ఏమీ పరిష్కరించరని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

Bandi Sanjay comments on CM KCR
Bandi Sanjay comments on CM KCR

By

Published : Nov 30, 2022, 8:52 PM IST

Bandi Sanjay comments on CM KCR: సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వటం తప్ప .. ఏమీ పరిష్కరించరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యంగాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌, ఆయన కుమార్తె కవిత మీద ఎన్నో కేసులు ఉన్నాయని విమర్శించారు. దేశం కోసం ధర్మం కోసం తాను ఎన్నోసార్లు జైలుకు వెళ్లానని పేర్కొన్నారు. కేసీఆర్‌ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరవేస్తామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నిన్న జరిగినా ప్రజాసంగ్రామ యాత్ర ఐదో విడత ప్రారంభసభలో బీజేపీ శ్రేణలు పెద్ద ఎత్తున పాల్గొనడం పట్ల సంతోశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని వారు నినదించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ పేరిట కొత్త నాటకానికి తెరతీశారని... వెయ్యి మంది కేసీఆర్‌లు, అసదుద్దీన్‌లు వచ్చినా మోదీని అడ్డుకోలేరని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. భాజపా అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామని.. వేధింపులకు గురైన హిందూ కార్యకర్తలపై కేసులు ఎత్తివేస్తామని బండి సంజయ్‌ తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details