దిల్లీకి చెందిన రింకు శర్మ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు కోరారు. ఈ మేరకు నిర్మల్ కలెక్టర్ కార్యలయంలో ఇన్ఛార్జ్ డీఆర్వో రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.
'రింకు శర్మ కుటుంబానికి న్యాయం చేయాలి' - ayodhya raamamandir updates
దిల్లీకి చెందిన భజరంగ్ దళ్ కార్యకర్త.. రింకు శర్మ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని నిర్మల్ జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
'రింకు శర్మ కుటుంబానికి న్యాయం చేయాలి'
అయోధ్య రామమందిర నిర్మాణానికి జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నందుకు ఇస్లాం వాదులు హత్య చేశారని ఆరోపించారు. దిల్లీ పోలీసులు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రింకు శర్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ.. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ