నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు.
బీజేవైఎం ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు - bjym latest news
స్వాతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు.
బీజేవైఎం ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
భగత్ సింగ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, నాయకులు మంచిర్యాల అజయ్, గిల్లి విజయ్, కొండాజీ శ్రావణ్, ఆకుల కార్తీక్, అఖిల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.